Akkineni Nagarjuna : మన్మధుడా మజాకా.. ఫస్ట్ సింగిల్ తో అదరగోట్టేశాడుగా.!

Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ చిత్రం ది ఘోస్ట్.. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతోంది.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా పై హైప్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసారు మేకర్స్..!

వేగం అంటూ సాగే మెలోడియస్ పాటను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో నాగార్జున సోనాల్ చౌహాన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. మలేషియాలో షూటింగ్ జరుపుకున్నా ఈ పాట లొకేషన్స్, విజువల్స్ అందరికీ వండర్ఫుల్ అందించాయి.. భరత్ సురబ్ స్వరపరిచిన ఈ పాటను కృష్ణ మదినేని రచించారు. కపిల్ కపిలన్, రమ్య బెహరా ఈ పాటను ఆలపించారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తర్కెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు..ఇంటర్పోల్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో నాగార్జున కనిపించనున్నారు..

Akkineni Nagarjuna The ghost movie vegam First single out
Akkineni Nagarjuna The ghost movie vegam First single out

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కురి రామ్మోహన్ రావు, శరత్ మరర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ పాట నాగార్జునలో మరోసారి మన్మధుడిని చూపించరు.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, టైలర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ పాట తో అంచనాలను మరింత పెంచేసాయి.. సినిమాపై హైప్ క్రియేట్ చేసాడు నాగార్జున.. దసరాకు విడుదల కానున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి..