Samantha : అక్కినేని ఫ్యామిలీ మొత్తానికీ రక్త కన్నీరు లాంటి బ్రేకింగ్ న్యూస్ చెప్పిన సమంత !

Samantha : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి పాపులారిటీకి దక్కించుకున్న సమంత త్వరలోనే శాకుంతలం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో మళ్లీ తన అభిమానులను పలకరించడానికి సిద్ధం అయింది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఫిబ్రవరి 17వ తేదీన భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా సమాచారం ప్రకారం పఠాన్ సినిమా ఇచ్చిన భారీ షాక్ తో ఈ సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. సమంత నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని మార్చ్ 27 కి వాయిదా వేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది.

akkineni-family-on-samantha-shakuntalam-movie-release-date
akkineni-family-on-samantha-shakuntalam-movie-release-date

సమంత తన సమయాన్ని వృధా చేయకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులను లైన్లో పెడుతుంది. ఇప్పటికే బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న షూటింగ్లో పాల్గొనింది. మరొకవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాలో కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా మయో సిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో సమంతా సినిమాలలో నటించదని సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోని సమంత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి రక్త కన్నీటిని తెప్పిస్తోంది.

“నేను ఒక దిశలో సర్వం కోల్పోయానని బాధపడ్డాను.. మనోధైర్యంతో అన్నింటిని ఎదిరించి సవాళ్లను ఎదుర్కొన్నాను” అంటూ మయోసిటీస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది సమంత మొత్తానికైతే ఒకవైపు సినిమాలు చేయడానికి అలాగే ఇంకొక వైపు వెబ్ సిరీస్ లో చేయడానికి కూడా సిద్ధం అవుతుంది. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.