Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆమె నటించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇక నిన్న అఖిల్ బర్తడే సందర్భంగా స్పెషల్ బర్తడే విషెస్ చెప్పిన సమంత బర్త్డే విషెస్ తో పాటు అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి అక్కినేని నాగచైతన్య తో సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆ కుటుంబంతో సత్సంబంధాలు తెగిపోయాయని అందరూ అనుకున్నారు.
కానీ ఈమె మాత్రం రానా, మిహికా , అఖిల్ తో తన స్నేహబంధాన్ని అలాగే కొనసాగిస్తుంది.. అంతేకాదు చాలామంది అక్కినేని కుటుంబీకులు సమంతతో ఇప్పటికీ చాట్ చేస్తూనే ఉంటారట. ఈ క్రమంలోనే అఖిల్ బర్త్ డే సందర్భంగా ఆమె స్పెషల్ విషెస్ తెలియజేసింది. కానీ గత ఏడాది అఖిల్కి సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు ఆయన రిప్లై ఇవ్వలేదు. ఇక ఈసారి కూడా ఆయన రిప్లై ఇవ్వరు అని ఆమె అక్కినేని ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని చూస్తున్నా.. వారు మాత్రం పట్టించుకోరు అంటూ రకరకాల కామెంట్లు వినిపించాయి. కానీ ఎవరు ఊహించని విధంగా అఖిల్ సమంత విషెస్ కి రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ సామ్.. నీ అంచనాలను తప్పకుండా అందుకుంటాను అంటూ పోస్ట్ చేశాడు.
కాగా నిన్న సాయంత్రం అఖిల్ పుట్టినరోజు సందర్భంగా చాలా గ్రాండ్ గా పార్టీ నిర్వహించగా ఆ పార్టీకి సమంత వచ్చినట్లు అందులో డాన్స్లతో తెగ సందడి చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.