shruthi Haasan : మరోసారి లవ్ లో ఫెయిల్యూర్ అయిన శృతిహాసన్..పోస్ట్ వైరల్..! 

shruthi Haasan :  విశ్వ నటుడు కమలహాసన్ పెద్ద కుమార్తె శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్లే బ్యాక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఆయన లాగానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏ రోజు కూడా తండ్రి పరపతిని ఉపయోగించుకోలేదని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈమె మళ్లీ లవ్ లో బ్రేకప్ అయ్యింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గతంలో హీరో సిద్ధార్థ తో ప్రేమాయణం నడిపిన ఈమె ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత ఇంకొక వ్యక్తితో ప్రేమలో పడి నచ్చకపోవడంతో విడిపోయింది . ఇప్పుడు మరొక బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా తో లవ్ లో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement
Again Sruthihassan gets break-up..post viral..!
Again Sruthihassan gets break-up..post viral..!

ప్రస్తుతం ఇతడికి కూడా బ్రేకప్ చెప్పేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు వినిపించడానికి ముఖ్య కారణం ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న పోస్ట్ అని తెలుస్తోంది. పోస్టులో “నాతో నేను ఉంటేనే సంతోషం .. నా విలువ , సమయాన్ని, ఒంటరితనాన్ని నేను ప్రేమిస్తున్నాను… జీవితంలో ఇక్కడి వరకు రావడం గొప్ప అదృష్టం.. అందుకు కృతజ్ఞతలు.. ఎట్టకేలకు ఈ విషయం నాకు బోధపడింది” అనే కామెంట్ చేసింది. ఇది చూసిన వారందరూ శృతిహాసన్ లవ్లో మళ్ళీ బ్రేకప్ అయ్యింది.. ఎట్టకేలకు రియలైజ్ అయినట్టుంది . అందుకే ఈ పోస్ట్ పెట్టింది అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Advertisement