Prabhas : ప్రభాస్ ని కలిసి వెళ్ళిన 48 గంటలు తిరగకుండానే బ్రహ్మాండమైన వార్త చెప్పి రాజ్ నాథ్ సింగ్ !

Prabhas : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటనతో.. సేవా గుణంతో.. మైత్రితో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకున్నారు. ఇక 1980 వరకు ఇండస్ట్రీలో కొనసాగిన కృష్ణంరాజు ఆ తర్వాత బిజెపి తీర్థం పుచ్చుకొని లోకసభకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాకినాడ నియోజకవర్గం నుంచి జరిగిన ఎన్నికల్లో కూడా గెలిచి.. కేంద్ర మంత్రిగా పదవీ స్వీకారం చేపట్టారు. ఇక బిజెపిలో కేంద్ర మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి నుంచి పోటీ చేసిన తర్వాత ఓడిపోవడం జరిగింది. ఇక తర్వాత రాజకీయాలనుంచి వైదొలిగారు.

ఇకపోతే సెప్టెంబర్ 11 తెల్లవారుజామున కృష్ణంరాజు గుండెపోటుతో పాటు ఇతర కారణాలవల్ల తుది శ్వాస విడిచారు. ఇక ఈయన మరణం సినీ ఇండస్ట్రీని సోకసంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా ఇంత గొప్ప నటుడిని, రాజకీయవేత్తను కోల్పోయిన ఇండస్ట్రీ పెద్ద దిక్కును కూడా కోల్పోయిందని చెప్పవచ్చు. ఇక కృష్ణంరాజు మరణాంతరం పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్కరుగా ప్రభాస్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ప్రభాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక కృష్ణంరాజు గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నాము అంటూ ఆయన వెల్లడించడం గమనార్హం.

After 48 hours of going with Prabhas, Rajnath Singh told the wonderful news
After 48 hours of going with Prabhas, Rajnath Singh told the wonderful news

రాజ్ నాథ్ సింగ్ ప్రభాస్ కుటుంబాన్ని పరామర్శించిన 48 గంటల తర్వాత ఒక శుభవార్తను తీసుకొచ్చారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి ఎంపీ సీటు ఇస్తామని ఆయన తెలిపినట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది . అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవికి మాత్రం ఎంపీ సీటు వరిస్తుందనే గాసిప్ బయటకు వచ్చినా.. ఈ విషయం తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై స్పష్టంగా క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఒక నెల రోజులపాటు తాను నటిస్తున్న ప్రాజెక్టులన్నింటికీ బ్రేక్ చెప్పి కుటుంబంతోనే గడపాలని నిర్ణయం తీసుకోవడంతో దర్శక నిర్మాతలకు కూడా ఆయన నిర్ణయానికి ఓకే చెప్పారు.

Advertisement