Prabhas Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రేక్షకులని ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు పార్ట్లు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించాయి.ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆదిపురుష్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఇటీవల ఆదిపురుష్ టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించగా, టీజర్ లో ఈ పాత్రలను ఏమాత్రం సరిగ్గా చూపించలేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆది పురుష్’ టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని.. వీఎఫ్ఎక్స్ దారుణమని.. సీరియల్ ప్రోమో చూసిన ఫీలింగ్ కలిగిందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఇది చిన్న పిల్లల కోసం తీసిన కార్టూన్ సినిమా లేదా యానిమేషన్ మూవీలా ఉందని విమర్శలు కురిపిస్తున్నారు. విజువల్ వండర్ ని అందిస్తారు అనుకుంటే.. టీవీలో ప్రసారమయ్యే సీరియల్ తరహా కంటెంట్ ను అందించారని డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చాలా ఆవేశంగా ఉన్న ఫ్యాన్స్ ని కూల్ చేసేందుకు మేకర్స్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల చేయాలని అనుకుంటున్నారట..
ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్ అతుల్ లు పాటలు అందిస్తుండగా ఈ ఫస్ట్ సింగిల్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు. ఈ పాటతో ప్రేక్షకులని ఇంప్రెస్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్. అయోధ్యలో ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా, ఈ టీజర్లో సముద్రం ఆడుగున తపస్సు చేసుకుంటూ ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడం అలరించింది. భూమి కృంగినా నింగి చీలినా న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. వస్తున్నా న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి అంటూ రావణుడితో పోరు సాగించడానికి సిద్ధమైనట్లుగా ప్రభాస్ చెప్పిన డైలాగ్ కూడా అదిరిపోయింది.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.