Adhithi Rao : అదితి రావు హైదరి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ గానే ఎక్కువ మందికి తెలుసు. హైదరి ఇటీవల హీరో సిద్దార్థ్ తో రిలేషన్ లో ఉన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా హైదరి యాటిట్యూడ్ పై తన మాజీ భర్త సత్యదీప్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు..
హైదరి టాలీవుడ్ హీరోయిన్ అని మాత్రమే తెలుసు.. కానీ తన బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ముందుగా తమిళ్ సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హైదరి తెలుగులో అంతరిక్షం ,వి, మహాసముద్రం వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. మరికొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఈమెకి ఇప్పటివరకు ఒక సాలిడ్ హిట్ పడలేదు.
హైదరి సిద్ధార్థ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలో జంటగా హాజరవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. హైదరికి బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రా ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.. పెళ్లయిన మూడేళ్ల తరవాత విడిపోయారు. వీరిద్దరికీ 2009లో పెళ్లి జరగా 2013లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
హైదరి మాజీ భర్త సత్యదీప్ మిశ్రా మసభా గుప్త ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన మొదటి భార్య గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలను చేశారు. అదితి తో నా రిలేషన్ లో ఉన్నప్పుడు.. నాకు ఇప్పుడు ప్రేమ మీద విరక్తి పుట్టింది. మరోసారి ప్రేమలో పడడం అంటేనే చాలా భయంగా ఉంది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్ళు మళ్ళీ రిలేషన్ ప్రేమ అంటే సాధారణంగా భయపడుతూ ఉంటారు. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలమంటూ చెప్పుకొచ్చాడు సత్యదీప్ మిశ్రా.. ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మాటలు సిద్దార్థ్ కూడా పనికొస్తాయాని హైదరి మాజీ భర్త ఇలా మాట్లాడాడని పలువురు అంటున్నారు.