Adivi Sesh : టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు నాగార్జున మేనకోడలు సుప్రియ ఒక్కటి కాబోతున్నారు అంటూ సోషల్ మీడియా గత కొన్నాళ్లుగా కోడే కోస్తోంది.. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అక్కినేని ఫ్యామిలీతో అడవి శేష్ దిగిన ఫోటోనే కారణం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

గతంలో సుప్రియ అడవి శేషు కలిసి గూడాచారి అనే సినిమాలో నటించారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కాగా సుప్రియ అడవి శేష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు రీసెంట్ గా రిలీజ్ అయిన ఫోటోలు మరొక హింట్ కూడా తెలుస్తోంది. ఈ ఫోటోలో సుప్రియ పక్కన అడివి శేష్ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని ఫ్యామిలీలో అడవి శేష్ కి ఏంటి సంబంధం అంటూ మరో న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. అక్కినేని ఇంటి పేరుకి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకొని అడవి శేష్ ఇలా సుప్రియ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ మరి కొంతమంది పెదవి విరుస్తున్నారు. సుప్రియ నిర్మాతగా, ప్రొడ్యూసర్ గా పలు సినిమాలను తీసింది.. అక్కినేని బ్యాక్ గ్రౌండ్ తో కొంత ఆస్తి వచ్చినా.. తన పుట్టింటి నుంచి మరికొంత ఆస్తి.. అలాగే తను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి ఇలా మొత్తంగా చూసుకుంటే సుమారు మూడు అంకెల వందల కోట్ల ఆస్తి ఆమె పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది.. అందుకే అడవి శేషు కావాలని ఆమెను ప్రేమిస్తున్నాడని.. ఆస్తి కోసమే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.