సూపర్ స్టార్ మహేష్ బాబు బోర్న్ ఆర్టిస్ట్: సీనియర్ యాక్టర్ శివ కృష్ణ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుసుకుంటారు. అతని సినిమా వచ్చిందంటే జనాలు పూనకాలతో ఊగిపోతూ వుంటారు. అతనినుండి సినిమా వస్తుందంటే నెలల తరబడి అభిమానులు పండగ చేసుకుంటారు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసునిగా వెండితెరకు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు జననం మద్రాసులో జరిగిందనే విషయం అందరికీ తెలిసినదే. మహేష్ చదువు కూడా అంటా మద్రాసులోనే సాగింది.

చిన్న తనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ 5 సంవత్సరాల వయసులో అంటే సరిగా 1979లో నీడ అనే చిత్రంతో తెరంగేట్రం చేసాడు. బాల్యనటుడిగా తన తండ్రితోపాటు 7 చిత్రాలకు పనిచేసిన మహేష్ బాలచంద్రుడు సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. తరువాత తిరిగి సోలో హీరోగా 1999లో ప్రిన్స్ మహేష్ బాబుగా రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. అప్పట్లో అందంగా మిల్క్ బాయ్ లాగా హాలీవుడ్ హీరోలను మరిపించే విదంగా ఉన్న మహేష్ యువతను తీవ్రంగా ఆకర్షించాడు. తరువాత అనతికాలంలోనే మురారి, ఒక్కడు, అతడు, పోకిరి వంటి సినిమాలతో తండ్రికి తగ్గ తనయుడిగా సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నాడు.

2003లో విడుదల అయిన ఒక్కడు సినిమా అయితే అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది. అక్కడితో ఆయన వెనక్కి తిరిగిచూసుకోవలసిన పనిలేకుండా పోయింది. అప్పటి వరకు ఓ రకమైన ఇమేజ్ వున్న మహేష్ ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు. దాంతో తెలుగు యువత ఒక్కసారిగా మహేష్ మాటని జపం చేయడం మొదలు పెట్టారు. తరువాత జరిగిన పరిణామాల గురించి అందరికీ తెల్సిందే. పోకిరి సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

కాగా మహేష్ బాబుని ఇష్టపడని ఆర్టిస్టులు వుండరు. తాజాగా అతని గురించి ఓ మీడియా వేదికగా సీనియర్ యాక్టర్ శివ కృష్ణ గారు మాట్లాడుతూ… మహేష్ బాబు బోర్న్ ఆర్టిస్టు అంటూ ఆకాశానికెత్తేశారు. మహేష్ బాబుని చిన్నప్పుడే తన మేనేజర్ ద్వారా చూసిన శివ కృష్ణ అతను ఫ్యూచర్ సూపర్ స్టార్ అవుతాడని జోశ్యం చెప్పాడట. కట్ చేస్తే మహేష్ బాబు నేటి పరిస్థితి అందరికీ తెలిసిందే. కాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘట్టమనేని అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు.