Samantha : చైతూ సమంత విడాకులపై నటి సంచలన వ్యాఖ్యలు..! తెరపైకి కొత్త వివాదం.!

Samantha : సాధారణంగా ఏ విషయంలో తప్పు జరిగిన కూడా అమ్మాయిదే తప్పు అని పాయింట్ అవుట్ చేస్తారు. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా అంతే ఇక స్టార్ కపుల్స్ ప్రేమించే పెళ్లి చేసుకుని వాళ్లు విడిపోయినా కూడా అందుకు కారణం ఆ స్టార్ హీరోయిన్ అనే నెపంవేసి చేతులు దులిపేసుకుంటారు.. కానీ అందులో నిజం ఎంత ఉందనేది ఎవరు ఆలోచించరు.. అలాంటి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది నటి రమ్య అలియాస్ దివ్య.

actress comments about samantha divorce
actress comments about samantha divorce

నటి రమ్య కోలీవుడ్, టాలీవుడ్ లో పలు సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో తన భావాలను పంచుకుంటుంది. దివ్య స్త్రీల విషయంలో ఎక్కడ అన్యాయం జరిగిన గొంతు లేపే మొదటి మహిళా.. ఇటీవల దీపికా పదుకొనే బికినీ ఫొటోస్ పై జరుగుతున్న ట్రోలింగ్ గురించి స్పందించింది. ఇక సోషల్ మీడియాలో విమెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ అంటూ సరికొత్త వివాదానికి తెర తీసి సంచలనాన్ని క్రియేట్ చేసింది దివ్య.

ప్రతి విషయంలో ఆడవాళ్లదే తప్పంటారా? మొన్నటికి మొన్న సమంత విడాకులు తీసుకున్నందుకు ట్రోల్ చేశారు.. సాయి పల్లవి తన అభిప్రాయం చెప్పినందుకు ట్రోల్ చేశారు. రష్మిక తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినందుకు ట్రోల్ చేశారు. ఇప్పుడు దీపిక బికినీ వేసుకున్నందుకు ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ జరిగిన అన్ని విషయాల్లో ఆడవాలనే తప్పంటున్నారు. ఇదే కాదు ఇంకా చాలా విషయాలు అలానే చేశారు. మహిళలేనే టార్గెట్గా ఎందుకు అందరూ వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఫ్రీ డమ్ ఆఫ్ చాయిస్ అందరి హక్కు.. మహిళలంటే దుర్గామాతకు ప్రతిరూపం అంటారు. మరి మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? ఇలా స్త్రీలపై ద్వేషించే పద్ధతిని అరికట్టాలి అంటూ దివ్య తనదైన స్టైల్ స్పందించింది.