Actors Life Story : సినిమాలలోకి రాకముందు కూడా జీవితం ఉంటుంది గా .. అప్పుడు ఏం చేసేవాళ్ళో తెలుసా !

Actors Life Story : తెరమీద కనిపించే హీరో హీరోయిన్స్ కూడా ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించి ఇస్తాయి కి వచ్చారు. సూపర్ స్టార్ నుంచి నేటి యువతరం హీరో హీరోయిన్స్ వరకు ఎంత మంది వారి జీవితాల్లో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అవడం చాలా కష్టం. ఎవరో ఒకరిద్దరికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. కొందరు సక్సెస్ అయ్యారు అని అనిపించినా కానీ వారి సక్సెస్ వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి. అలా స్టార్స్ అయిన వాళ్లు కూడా మెల్లమెల్లగా ఒక్కొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఈరోజు శిఖరాగ్రంలో నిలబడిన వాళ్లే. అంతేకానీ ఒకేసారి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు యాక్టర్స్ గా అభిమానిస్తున్న చాలా మంది చిన్న చిన్న పనులు చేసి వచ్చిన వారే.. అందుకే మన పనిని మనం మర్చిపోకూడదు. మన వృత్తిని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉండాలి..

సూపర్ స్టార్ రజినీకాంత్ పేరే ఓ సెన్సేషన్.. కానీ ఆయన సినిమాలకు రాకముందు.. ఒకప్పుడు కార్పెంటర్, కూలీ , బస్ కండక్టర్ కూడా.. రజినీకాంత్ బస్ కండక్టర్గా పనిచేస్తున్నప్పుడు నీ స్టైల్ బాగుందని తన ఫ్రెండ్ చెప్పడంతో సినిమాల్లోకి వచ్చాడు. అంతకు అంతా ఎదిగి ఇప్పుడు గాడ్ ఆఫ్ సినిమా గా మారిపోయాడు. రజినీకాంత్ అయినా ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నారు.

షారుక్ ఖాన్ కూడా ఒకప్పుడు మనలాగే సామాన్యుడు. ఢిల్లీలో ఒక చిన్న రెస్టారెంట్ ను స్టార్ట్ చేశాడు. అది కూడా ఫెయిల్ అవ్వడంతో ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. అవకాశాల కోసం ముంబై వచ్చాడు. ఉండటానికి చోటు లేక హోటల్స్ ముందు నిద్రపోయేవాడు. ఆ తర్వాత దూరదర్శన్లో ఒక సీరియల్ కోసం ఎంపికైపోయాడు. ఆ తర్వాత ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది.

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు అనుకుంటారు అంతా.. కానీ అంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కూడా నటించాడు.

సాయి పల్లవి.. ఫిదా సినిమాతో టాలీవుడ్ ను ఊపు ఊపేసింది. అంతకుముందు కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించింది. ఈ విషయాలు ఏమీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు.

త్రిష రెండు దేశాలకు పైగా సినీ ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఈమె కూడా వర్షం సినిమాలో నటించక ముందు పలు సైడ్ రోల్స్ లో నటించింది. ప్రతి అవకాశాన్ని అందుపుచ్చుకొని ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

విజయ్ సేతుపతి ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేని స్థాయికి వెళ్ళిపోయారు. ఈయన సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సైడ్ క్యారెక్టర్స్ తో పాటు అసలు ఈయన సినిమాలో ఉన్నారా అనే పాత్రలలో కూడా నటించారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు.