Bigg Boss 6 Telugu : భలే దొరికావు రా బిగ్ బాస్ గా .. లోపల జరిగేది మొత్తం అభినయశ్రీ బయటపెట్టిందిగా !!

Bigg Boss 6 Telugu : బుల్ల‌తెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొనాల‌ని చాలా మంది ఆస‌క్తి చూపుతుంటారు. కాని ఆ అవ‌కాశం కొందరికి మాత్ర‌మే వ‌స్తుంది. వ‌చ్చిన వారు స‌రిగ్గా ఉప‌యోగించుకోపోతే మొద‌టి వార‌మో రెండో వార‌మో బ‌య‌ట‌కు రావడం ఖాయం. ఈ సారి 21 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌గా, తొలివారం హౌజ్ నుండి ఎవ‌రిని బ‌య‌ట‌కు పంప‌లేదు. రెండో వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ చేశారు. ముందుగా షానుని ఎలిమినేట్ చేసిన నాగార్జున‌, అభిన‌య శ్రీని రెండో కంటెస్టెంట్‌గా బ‌య‌ట‌కు పంపారు.ఇక బ‌య‌ట‌కు వ‌చ్చాక అభిన‌య శ్రీ బిగ్ బాస్‌పై దారుణ‌మైన‌ కామెంట్స్ చేస్తుంది.

మొదటి వారమే ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లి తృటిలో బయటపడిన అభినయ.. సెకండ్ వీక్‌లో బయటకు వచ్చేసింది. ఇక బ‌య‌టకు వచ్చాక ఓ యూట్యూబ్ ఛానల్‎తో మాట్లాడిన అభినయ రెమ్యునరేషన్ గురించి స్పందించింది. అంతేకాకుండా.. బిగ్ బాస్ వల్ల తనకు ఎలాంటి మేలు జరగలేదని వాపోయింది. మీకు రోజుకు రూ. 40 వేలు.. దాదాపు ఇప్పటివరకు రూ. 5 లక్షలు ఇచ్చారట కదా అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా, అవ‌న్నీ అబ‌ద్దాలు అని కొట్టి పారేసింది. ఇక నా విషయంలో చాలా అన్యాయం జరిగింది. హౌస్ లో జరిగిన ఇంపార్టెంట్ సీన్స్ ప్లే అవ్వలేదు. ముఖ్యంగా నాకు సంబంధించిన క్లిప్స్ బయటికి పెద్దగా రాలేదు.. ఆ విషయం నేను బయటికి వచ్చిన తరువాత నాకు తెలిసింది అన్నారు.

Abhinayashree comments on Bigg Boss 6 Telugu
Abhinayashree comments on Bigg Boss 6 Telugu

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్‌పై ఫైర్..

హౌస్ లో తాను చాలా హుషారుగా ఉన్న‌వి, గేమ్ లో కూడా బాగా ఆడిన‌వి ఏమి చూపించుకుండా.. తాను దిగాలుగా కూర్చుని ఉండటమే ఎక్కువగా చూపించారని వాపోయింది అభినయశ్రీ. నేను మాట్లాడింది…డాన్సులు చేసింది.. ఆర్గ్యుమెంట్ చేసింది ఏ ఒక్కటీ చూపించలేదంటూ బాధపడింది. ఓటింగ్ విషయంలో తనకంటే త‌క్కువ‌ పొజిషన్ లో ఇద్దరు ఉన్నారని.. వాళ్ల‌ని సేవ్ చేసి న‌న్ను ఎలిమినేట్ చేయ‌డం ఏంటా అని అర్ధంకాలేదు అంటూ ఈ ఐటం భామ చెప్పుకొచ్చింది. ఇక విన్న‌ర్ ఎవరవుతారని అనుకుంటున్నారని అడగ్గా.. గీతూ.. రేవంత్ ప్రతి వారం నామినేట్ అవుతున్నారు.. సేవ్ అవుతున్నారని. వీరిలో ఒకరు కావొచ్చని.. కానీ ఇదంతా అన్ ఫేయిర్ అని తనకు అనిపిస్తుందని తెలిపింది.

Advertisement