Bigg Boss 6 Telugu : కామన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ లోకి అడుగుపెట్టారు ఆదిరెడ్డి. ఈసారి 21 మంది హౌస్ లోకి అడుగుపెట్టగా ఆదిరెడ్డి మాత్రం కామన్ మ్యాన్ తరహాలో హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఇంతకుముందు బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చుకుంటూ తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేసుకున్నాడు. బిగ్ బాస్ లోకి ఆదిరెడ్డి అడుగుపెట్టిన తర్వాత అతనిపై కొంత నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ చాలా వరకు ఆ తర్వాత తొందరగా వెళ్ళిపోతాడనే కామెంట్ కూడా చేశారు .కానీ గేమ్ లో తన స్ట్రాటజీ ఫాలో అవుతూ ముందుకు కొనసాగాడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ అందరికీ సవాల్ విసిరాడు.

ఇకపోతే కుటుంబ పరిస్థితి గురించి చెబుతూ అప్పుల పాలైన తన తండ్రి కొన్నాళ్ళపాటు అప్పుల్లో వస్తే దాక్కోవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది అంటూ తన కష్టాలను చెప్పుకున్న ఆదిరెడ్డి.. ప్రస్తుతం తన తండ్రి అప్పులు తీర్చే అంత పారితోషికం పొందాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే వారానికి రూ.40,000 చొప్పున 15 వారాలకు గాను రూ.6లక్షల వరకు పారితోషకం లభించింది. టాప్ 5లో ఉండడం వల్ల అదనంగా మరో రూ.5లక్షలు బోనస్ గా రావడంతో మొత్తం రూ.11 లక్షలు వచ్చినట్లు సమాచారం. ఒక కామన్ మ్యాన్ కి ఇంత డబ్బు రావడం అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి.