Rajinikanth సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారుగా రూ.500 కోట్ల ఆస్తికి అధిపతి అయినప్పటికీ ఏ రోజు కూడా తన హోదాను చూపించుకోలేదు. అయితే వరుస సినిమాలు చేస్తూ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూనే ఏ రోజు కూడా డబ్బున్నవాడిలా ప్రవర్తించలేదు. ఈ క్రమంలోనే ఒక రోజు ఒక మహిళ రజనీకాంత్ ని చూసి బిచ్చగాడు అనుకోని పది రూపాయలు చేతిలో పెట్టింది.. అసలు విషయం తెలుసుకొని ఆమె చేసిన పనికి రాజినీకాంత్ ఏం తెలిపారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

బెంగళూరులో ఉన్నప్పుడు ఒకరోజు రజనీకాంత్ నార్మల్ డ్రెస్ వేసుకొని.. పెరిగిన జుట్టు , గడ్డంతో గుడి దగ్గర కూర్చున్నాడట . అయితే అతడిని ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ఒక మహిళ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మెట్లపై కూర్చున్న బిచ్చగాళ్ళు అందరికీ డబ్బులు ఇస్తూనే రజినీకాంత్ చేతిలో కూడా పది రూపాయలు పెట్టి లోపలికి వెళ్లిందట. దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు రజనీకాంత్ ఖరీదైన కారులో ఎక్కడ చూసి ఆమె ఆశ్చర్యపోయి.. కార్ ఆపి ఎవరో తెలియక తప్పు చేశాను క్షమించండి అంటూ రజనీకాంత్ ను వేడుకొందట.. కానీ రజనీకాంత్ ఇందులో నీ తప్ప ఏమీ లేదమ్మా.. డబ్బు అనే అహం తో వున్న నన్ను.. ఎంతవున్నా బిచ్చగాడివే అని నిరూపించడానికి భగవంతుడు ఇలా చేశాడు. నీ తప్పులేదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారట రజినీకాంత్. ఇది చూసి రజనీకాంత్ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.