NTR-YSR : ఎన్టీయార్ vs వైఎస్సార్.. గెలుపు ఎవరిది ?

NTR-YSR :  హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తీసేసి కొత్తగా డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం పెద్ద వివాదమవుతోంది. 1986లో మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, పారా మెడికల్ కలేజీలన్నింటినీ కలిపి ఒక యూనివర్సిటి పరిధిలోకి తీసుకురావాలనే ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటినీ ఏర్పాటుచేశారు. 1998లో హెల్త్ యూనివర్సిటికి చంద్రబాబునాయుడు ఎన్టీయార్ పేరు తగిలించి ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటిగా మార్చారు.

ఇపుడు జగన్మోహన్ రెడ్డి అదే యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటి అని పేరు మార్చారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం సభ ఆమోదం చెప్పటం పేరు మార్చటం అంతా అయిపోయింది. దీనిపై టీడీపీ ఎంతగా అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నిజానికి ఎన్టీయార్, వైఎస్సార్ ఇద్దరూ ఇద్దరే. సినిమాల్లో నుండి ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన 8 నెలల్లోనే అధికారంలోకి రావటం అప్పట్లో ఒక సంచలనం.

who will win NTR-YSR 
who will win NTR-YSR

ఇక డాక్టర్ గా ప్రజాసేవ చేస్తున్న వైఎస్సార్ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి పులివెందులలో ఎంఎల్ఏగా లేకపోతే కడప ఎంపీగా గెలుస్తునే ఉన్నారు. ఎన్నికల్లో ఓటమెరుగని నేతగా వైఎస్సార్ కూడా చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఉన్నది ఐదేళ్ళే అయినా తెలుగు రాజకీయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారు. హెల్త్ యూనివర్సిటితో ఎలాంటి సంబంధంలేని వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్సిటికీ ఎలా పెడతారని టీడీపీ అడుగుతోంది. అయితే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలతో ఎన్టీయార్ కు కూడా ఎలాంటి సంబంధంలేదని సభలో జగన్ చెప్పారు.

ఎన్టీయార్ సీఎం అయ్యేనాటికే రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలుంటే వైఎస్సార్ సీఎం అయిన తర్వాత మూడు కాలేజీలను ఏర్పాటు చేసినట్లు జగన్ చెప్పారు. ఎన్టీయార్ అధికారంలో ఉన్నపుడు కానీ టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయలేదన్నది జగన్ వాదన. తమ ప్రభుత్వం ఒకేసారి 14 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. స్వతహాగానే డాక్టర్ కాబట్టి వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్సిటికి పెట్టడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. రెండు వైపుల వాదనలు విన్న జనాలు ఏమంటారో చూడాలి.