శాక్రిఫైస్ స్టార్ సునిషిత్ అంటే ఎవరో తెలియనివారు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా ఎవరూ వుండరు. అతడు సెలిబ్రిటీ అవునో కాదో ఆ దేవుడికెరుకగాని, సెలిబ్రిటీల పేరుని వాడుకొని శాక్రిఫైస్ స్టార్ గా అవతరించేశాడు. అది ఏ విధంగా అన్నది అందరికీ తెలిసిందే. శ్రీరామోజు సునిశిత్ అనే ఈ వ్యక్తి కరోనా కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్‌గా మారిపోయాడు. మనోడికి పబ్లిసిటీ పిచ్చి కారణమో లేక మెంటల్ డిజెబిలిటీ ఉందో గానీ టాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.
ఈ క్రమంలోనే పలువురి సెలిబ్రిటీలపైన తనకు నచ్చినట్టు మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసేవాడు. అయితే మొన్నటి వరకు తనని ఓ జోకర్ లాగా చూసే జనాలు, తాజాగా పరిణామాలతో మాత్రం అతగాడిపైన విసుగుపోయారు. దాంతో సునిషిత్ ఎక్కడ కనిపిస్తే అక్కడ అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఆమధ్య తనపై అసత్య ప్రచారం చేస్తూ సునిశిత్ అనే వ్యక్తి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని హీరోయిన్ లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసినదే.
ఇక సాయిధరమ్ తేజ్ ఆమధ్య వాడిన బైక్ తనదే అంటూ సునిషిత్ హల్ చల్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఇలాగే ఓ పోలీస్ అధికారిపై తప్పుడు ఆరోపణలు చేసి ఓసారి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ ఎస్ఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఎన్ని జరిగినా బుద్ధి రాని సునిషిత్ తన సొల్లు కబుర్ల పరంపరను ఇంకా కొనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్, ఉపాసన గురించి తప్పుగా మాట్లాడి అడ్డంగా బుక్కయ్యాడు. దాంతో రామ్ చరణ్ అభిమానులు సునీషిత్‌ను తాజాగా చితకబాదిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఈ వీడియో ఎప్పుడైతే బయటపడిందో సునిషిత్ మహేష్ బాబు విషయంలో చేసిన వ్యాఖ్యలకుగాను అతని అభిమానులు మన శాక్రిఫైస్ స్టార్ ని ఓ ఆటాడుకున్న వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మనోళ్లు అతగాడిని బాగా ఆడేసుకున్నారు.
ఇకపోతే, సునిశిత్ స్వస్థలం తెలంగాణలోని జనగాం. ఎంటెక్ వరకు చదువుకున్న సునిషిత్ కొన్నాళ్ల పాటు ఓ కాలేజీలో పనిచేశాడు. తరువాత సినిమాలమీద మక్కువతో అవకాశాల కోసం ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఐతే రాత్రికి రాత్రే స్టార్ కావాలని, తన గురించి అందరూ మాట్లాడుకోవాలన్న ఉద్దేశంతో… ప్రచారం కోసం ఇలాంటి కొత్త మార్గం… కాదుకాదు, చెత్త మార్గం ఎంచుకున్నాడు.