భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప వంటి రైతులు పంట నష్టపోయి తీవ్ర బాధలో మునిగితేలుతున్నారు. అయితే ఇలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
రైతన్నలు ఎంత మేర నష్టపోయారనేది క్యాలిక్యులేట్ చేసి వారికి నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరారు. ముఖ్యంగా తీవ్రస్థాయిలో నష్టపోయిన వరి రైతులని ఆదుకోవాలని నొప్పి చెప్పారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయే రైతుల వేదనను తాను కళ్ళారా చూశానని.. ముఖ్యంగా కౌలు రైతుల వేదన వర్ణనాతీతం అని పేర్కొన్నారు. వీటన్నిటిని చూసిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయి అప్పుల పాలయ్యే రైతులకి అండగా నిలబడేందుకు ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రైతు ప్రతినిధులు, వ్యవసాయ ఆర్థిక వేత్తలతో చర్చలు కూడా ప్రారంభించామని తెలిపారు.