Janasena: పవన్ కు ఒకేసారి రెండు అవకాశాలొస్తున్నాయా ?

Janasena:  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఒకేసారి రెండు అవకాశాలు వచ్చినట్లే ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోను తన సత్తా చాటటానికి మంచి అవకాశం వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. ఇదే సమయంలో ఏపిలోని హిందుపురం పార్లమెంటుకు కూడా ఉపఎన్నిక గ్యారెంటీ అనే ప్రచారం పెరిగిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలకు ముందు వస్తున్న ట్రైలర్, టీజర్ లాంట ఉపఎన్నికల్లో సత్తా చాటటానికి పవన్ రెడీగా ఉన్నారా ?

Advertisement

Advertisement

ముందుగా తెలంగాణాలోని మునుగోడు ఉపఎన్నికనే తీసుకుందాం. కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామాతో ఈ స్ధానం ఖాళీ అవబోతోంది. స్పీకర్ రాజీనామాను ఆమోదిస్తే ఉపఎన్నిక ఖాయమవుతుంది. ఉపఎన్నిక ఎప్పుడు నిర్వహించేది కేంద్ర ఎన్నికల కమీషన్ ఇష్టం. రాబోయే డిసెంబర్లో జరుగుతుందని అనుకుంటున్న ఉపఎన్నికలో జనసేన పోటీ చేస్తుందా అనేది సస్పెన్సుగా ఉంది. తెలంగాణా ఎన్నికలో జనసేన పోటీచేస్తుందని గతంలోనే పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒంటరిగా పోటీచేసినా జనసేనకు 30 సీట్లలో గెలుపు అవకాశాలున్నాయని చెప్పారు. కాబట్టి ఇపుడు మునుగోడులో పోటీచేస్తే జనసేన సత్తా ఏమిటో తెలుస్తుంది. ఈ ఉపఎన్నికను షెడ్యూల్ ఎన్నికల్లో పోటీకి పవన్ ఒక ట్రైలర్ గా భావించాలి. ఒకవేళ ఇపుడుగనుక పోటీచేయకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీసత్తా ఏమిటో ఎవరికైనా ఎలా తెలుస్తుంది ? కాబట్టి కచ్చితంగా ఉపఎన్నికను పవన్ ఉపయోగించుకోవాల్సిందే.

ఇదే సమయంలో హిందుపురం పార్లమెంటు ఉపఎన్నిక ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకమహిళతో నగ్నంగా నిలబడి మాట్లాడుతున్నట్లుగా వీడియో ఒకటి వెలుగుచూసింది. దాంతో పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి ఇమేజికి అది డ్యామేజీగా మారింది. పార్టీపైన పడిన మరకను తుడిచేసుకోవాలంటే మాధవ్ తో ఎంపీగా రాజీనామా చేయించాల్సిందే అని పార్టీలో చాలామంది అభిప్రాయపడుతున్నారు.

వీడియో ఒరిజినలా లేక ఫేకా అనేది తేలాలంటే సమయం పడుతుంది. ఒకవేళ ఫేకే అయినా పార్టీమీద పడిన మరకను తొలగించుకునేందుకు మాధవ్ తో రాజీనామా చేయిస్తేనే మంచిదనే అభిప్రాయం మెజారిటి నేతల్లో ఉంది. కాబట్టి జగన్ కూడా అలాగే ఆలోచించి ఎంపీతో రాజీనామా చేయిస్తే ఇక్కడ కూడా ఉపఎన్నిక ఖాయమే. కాబట్టి ఇక్కడ జనసేన పోటీచేసే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పవన్ పైనే ఉంది.


జగన్ పై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసిందని, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారంలోకి వచ్చేది జనసేనే అని పవన్ పదే పదే చెబుతున్నారు. నిజంగా జనాలంతా తమవైపే ఉన్నారనేది ప్రూవ్ కావాలంటే జనసేన హిందుపురం ఉపఎన్నిక వస్తే కచ్చితంగా పోటీచేయాల్సిందే. లేకపోతే ఏపీలో కూడా జనసేన విషయంలో జనాభిప్రాయం ఏమిటనేది తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి వచ్చే అవకాశాలను పవన్ వదులుకోరని అందరు అనుకుంటున్నారు. మరి పవన్ ఏమిచేస్తారో చూడాల్సిందే.

Advertisement