Nara Lokesh : అందరి ముందు పడిపోయాడు పప్పు.. పొలమే దున్నలేకపోతున్నాడు .. వీడు సీఎం అయ్యి ఏం ఉద్దరిస్తాడు..

Nara Lokesh : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. 15వ రోజు ఇవ్వగలం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం, శ్రీరంగ రాజపురం మండలాల్లో పర్యటించారు. ఎస్సీలతో, కాపులతో, బెల్లం రైతులతో, బెంగళూరులో స్థిరపడిన స్థానికులతో పలుచోట్ల సమావేశం ప్రసంగించారు..

లోకేష్ పాదయాత్ర ప్రారంభం నుంచీ పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే లోకేష్ మీద మూడు కేసులు నమోదు చేయగా.. ప్రచార రథంతో పాటు రెండు సౌండ్‌ వెహికల్స్‌ను సీజ్‌ చేశారు. పాదయాత్ర లో లోకేష్ ను కలిసేందుకు వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి స్టూల్‌ ఎక్కి, మైకులో ప్రసంగించేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదు. జీడీ నెల్లూరు మండలం సమిసిరెడ్డిపల్లెలో గురువారం లోకేశ్‌ నుంచి పోలీసులు మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. లోకేష్ శుక్రవారం నాటి పాదయాత్రలో ఆయా వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో మినహా రోడ్ల మీద ఎక్కడా మైకులో మాట్లాడలేదు.

Nara Lokesh harvesting on padayatra
Nara Lokesh harvesting on padayatra

 

యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్‌ శుక్రవారం పాలసముద్రం, శ్రీరంగరాజపురం మండలాల్లో 14 కిలోమీటర్ల మేర నడిచారు. శుక్రవారం రేణుకాపురం శిబిరం వద్ద బెంగళూరు లో స్థిరపడిన స్థానిక వ్యాపారులతో భేటీ అయ్యారు. ఎగువకమ్మకండ్రిగలో నాగలితో పొలం దున్ని రైతుల సమస్యలు తెలుసుకున్నారు లోకేష్.. పొలం సరిగ్గా దున్నలేదు.. వీడేలా సీఎం అవుతాడు అంటూ లే డిజైన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయినా ఫిబ్రవరిలో ఎవరైనా పొలం దున్నుతార ఇది ఎక్కడ విడ్డూరం రా నాయనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. సోషల్ మీడియాలో లోకేష్ పొలం దున్నిన వీడియో చక్కర్లు కొడుతోంది.