Breaking: వైసీపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెద్ద చిచ్చుపెట్టి నట్లయింది. రెండోసారి మంత్రి పదవులు వస్తాయని ఆశ పడ్డ ఆశావహులకు.. కొంతమందికి రాకపోవటంతో మనస్తాపం చెందారు. ఈ క్రమంలో లో మాజీ మంత్రి మేకతోటి సుచరిత… మంత్రి పదవి రాకపోయినా కానీ వ్యక్తిగతంగా ఆమె.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో తన నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు రాజీనామా చేయొద్దని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వైసీపీలోనే కొనసాగుతానని సుచరిత హామీ ఇచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే బాటలో మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు.. ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.