Mahasena : మహాసేన జనసేన లోకి వెళ్ళకుండా టీడీపీ లోకి ఎందుకు జాయిన్ అయ్యాడు ??

Mahasena :  రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసుకున్న టిడిపి పార్టీ ఇప్పటినుండి కీలక వ్యక్తులను వారి పార్టీలోకి చేర్చుకునే పనిలో పడింది.. అయితే టిడిపిని కాదనుకొని గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిన వారికి తిరిగి రావాలంటే ఆహ్వానం పంపిస్తున్నట్లు సమాచారం అందుతుంది.. తమ పార్టీ నుంచి గెలిచి టిడిపిలో వెళ్లిన వారికే కాకుండా.. వైసిపి నుంచి తమ పార్టీలోకి రావాలి అనుకునే వారికి కూడా సానుకూలంగా ఆహ్వానం పంపించినట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు మహాసేన రాజేష్ సైతం టిడిపిలో చేరబోతున్నారు ఈనెల 16న టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నారు..

Advertisement

Advertisement

రాజేష్ జర్నలిస్టుగా, వ్యాఖ్యాతగా రాజేష్ కు మంచి పేరుంది.. మహాసేన జర్నలిస్టుగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితం. గత ఎన్నికల్లో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సిపి లో చేరి వైఎస్ఆర్సిపి గెలుపు కోసం కష్టపడ్డారు. ఆ తరువాత పార్టీతో విభేదాలు రావడంతో బయటకు వచ్చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ పార్టీకి దగ్గర అవడం జనసేన కార్యకర్తల గెలుచుకోవడం వంటి పలు అంశాలు కూడా జరిగాయి.

Mahasena Rajesh joins in TDP
Mahasena Rajesh joins in TDP

ఆ మధ్య జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫామ్ అయ్యిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అసలు ఏం జరిగిందో తెలియదు కానీ.. జనసేనతో కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు రాజేష్. మళ్ళీ ఇప్పుడు టిడిపి పార్టీలోకి వెళ్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. రాజేష్ జనసేన పార్టీని కాదని టిడిపిలోకి వెళ్లడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టిడిపిలోకి మహాసేన రాజేష్ ఈనెల 16న రానున్నట్లు అధికారికంగా వెళ్లడైంది. ఇక ఈయన రాకతో టిడిపిలో పెను మార్పులు జరగనున్నాయని టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement