Breaking news: రేపు ఆంధ్రప్రదేశ్‌లో హైవేల దిగ్బంధనం.. లారీ ఓనర్ల ధర్నా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం గత కొద్ది రోజులుగా ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమానికి అన్ని రంగాల నుంచి కావలసిన సపోర్టు లభిస్తోంది. ఈ క్రమంలోనే లారీ అసోసియేషన్ కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకై చేపట్టిన ఉద్యమానికి మద్దతును ప్రకటించింది. బుధవారం అంటే మే మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లారీల బంద్‌ చేపట్టనున్నట్లు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు.

breaking-news-blockade-of-highways-in-andhra-pradesh-tomorrow-lorry-owners-dharna
breaking-news-blockade-of-highways-in-andhra-pradesh-tomorrow-lorry-owners-dharna

విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ సమితి కోరిందని, వారి కోరిక మేరకు లారీల బంధు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈశ్వర రావు వెల్లడించారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఎక్కడున్నా లారీలు అక్కడే నిలిచిపోవాలని ఆయన లారీ యజమానులకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో రవాణా రంగానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎంతో కీలకంగా మారింది. ఈ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే క్వాలిటీ ఉక్కును లారీలు తరలిస్తుండగా చాలామంది ఉపాధి పొందుతున్నారు.

ఆ విధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని జీవన ఉపాధి కల్పించడంలో దోహదపడుతోంది. అలాంటి కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ లారీ ఓనర్ కి ఉందని, అందుకే బంద్‌లో పాల్గొనాల్సిందిగా కార్యదర్శి కోరారు.