Breaking: కాపునేత ముద్రగడ బహిరంగలేఖ.. త్వరలో ఉత్కంఠకు తెర!

ప్రముఖ కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం కాసేపటి క్రితమే ప్రజలను బహిరంగలేఖ రాశారు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. తుని ఘటన తరువాత తనని తీహార్ జైలుకి ప్రయత్నం చేసారని, అలాంటివాటికి భయపడనని, ఎట్టి పరిస్థితులలోను లోంగే మనిషినికానని చెప్పుకొచ్చారు. కొందరు సో కాల్డ్ నేతలు తనని బెయిల్ తెచ్చుకొని, ఎక్కడికన్నా దూరంగా వెళ్లిపొమ్మని సూచించారని, తాను తప్పుచేస్తేనే కదా భయపడాలి అని లేఖలో పేర్కొన్నారు. అయితే నిజంగా వారు చెప్పినట్టు చేస్తే ఉద్యమం చులకనయ్యేదని, అలా ఎప్పటికీ చేయబోనని అన్నారు. కాగా ముద్రగడ నిర్దోషిగా బయటకు వచ్చిన సంగతి విదితమే.

ముద్రగడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి జన్మించారు. ముద్రగడ తండ్రి అయినటువంటి లేటు వీరరాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 67 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నిరుపేద దళితులకు ఆయన అభిమాన నాయకుడు. ఆయన జీవిత కాలమంతా నిరుపేదలకు ఉపశమనం కలిగించడం కోసమే కృషి చేశారు.