Breaking: ఇకపై మూడు విడతల్లోనే విద్యా దీవెన.. ఫీజులపై మంత్రి క్లారిటీ!

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు విజయవాడలోని సమగ్రశిక్ష అభియాన్ కార్యాలయంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో చర్చలు జరిపిన తర్వాత పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన పథకం గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు విడతల్లోనే విద్యా దీవెన ఫీజులను చెల్లిస్తామని వెల్లడించారు. చివరి మూడు, నాలుగు విడతలను కలిపి ఒకే విడతగా ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఆల్రెడీ ఆమోదం తెలిపారని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి ఇంకా మాట్లాడుతూ.. “విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాలో జమ చేసిన డబ్బులనే చెల్లించాలని విద్యార్థులను కోరుతున్నారు. బీటెక్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఇంకా మూడు త్రైమాసికాల్లో డబ్బులను జమ చేయాల్సి ఉంది. వారికి ఏం భయం అక్కర్లేదు ఎందుకంటే సర్టిఫికెట్లను తీసుకునే లోపు పథకం కింద డబ్బులను వేస్తాం” అని పేర్కొన్నారు.