Big Breaking: హైకోర్టు ఎదుట లొంగిపోయిన వివేకా హత్య కేసు ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కొద్ది గంటల క్రితమే నాంపల్లి సీబీఐ కోర్టులో సరెండర్ అయ్యాడు. వివేకా మర్డర్ కేసులో ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఇంతకుముందు డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. 2019 మార్చి 28న సెట్ అధికారులు అతడిని అరెస్టు చేశారు. కాగా బెయిల్ లభించడంతో అతను బయట తిరుగుతున్నాడు. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ అభిప్రాయపడింది. అందుకే అతని బెయిల్‌ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌తో ఏకీభవిస్తూ హైకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. అనంతరం గంగిరెడ్డికి మే ఐదవ తేదీలోగా సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు గంగిరెడ్డి ఇవాళ ఉదయం కోర్టులో లొంగిపోయారు. హైకోర్టు గంగిరెడ్డికి వ్యతిరేకంగా ఈ కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ బెయిల్‌ను రద్దు చేసింది.