Big Breaking: ఆంధ్ర ప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ 10వ తరగది విద్యార్థులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న SSC 2023 ఫలితాలు వచ్చేసాయి. ఈరోజు అంటే మే 6, 2023 ఉదయం సరిగ్గా 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా ఇవి ప్రకటించబడ్డాయి. ఈ పరీక్షలు ఆఫ్‌లైన్ మోడ్‌లో ఏప్రిల్ 2023లో రాష్ట్రవ్యాప్తంగా 3,349 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడ్డాయనే విషయం అందరికీ తెలిసినదే. విద్యార్థులు ఫలితాలు కోసం bse.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

విద్యార్థులు తమ SSC ఫలితాలను AP SSC బోర్డు 2023ని తనిఖీ చేయడానికి కింది స్టెప్స్ ఫాలోకండి.

1. అధికారిక వెబ్‌సైట్ BSEAP – bse.ap.gov.inకి వెళ్లండి.

2. హోమ్‌పేజీలో, AP SSC ఫలితం 2023 లింక్ చూడండి.

3. తరువాత దానిపై క్లిక్ చేశాక, స్క్రీన్‌పై కొత్త లాగిన్ విండో కనిపిస్తుంది.

4. అందులో రోల్ నంబర్ లేదా హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.

5. ఇప్పుడు, సబ్మిట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

6. తరువాత మీకు ఏపీ SSC ఫలితం 2023 స్క్రీన్‌పై కనిపిస్తుంది.