ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. మే 3న అంటే బుధవారం నాడు విశాఖపట్నంలో తిరగనున్నారు. ఈ సమయంలో జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయనున్నారు. అంతేకాదు, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు పునః ప్రారంభించనున్నారు. అలానే, విశాఖపట్నం– మధురవాడలోని రిషికొండలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారని సీఎం ఆఫీస్ వర్గాలు తెలిపాయి.
ఇక ఇదే రోజున వైజాగ్ టెక్ పార్క్( అదానీ డేటా సెంటర్) నిర్మాణ పనులకు సైతం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చెయ్యనున్నారు. ఈ పార్కును 134 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెక్ పార్కు మూడు దశలలో పూర్తి చేయనున్నారు. ఇందుకు ఏడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ పార్క్ ద్వారా వేలాదిమందికే ఉద్యోగాలు లభించనున్నాయి.