Andhra Pradesh: రేషన్ కార్డుదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..!!

Andhra Pradesh.. ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది. ప్రస్తుతం ఇస్తున్న రేషన్ బియ్యానికి బదులు రాగులు, జొన్నలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ విషయాన్ని ప్రస్తుతం రాయలసీమ జిల్లాలలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రాయలసీమలో ఇది గనుక సక్సెస్ అయితే దశలవారీగా రాష్ట్రమంతటా ఈ విధానం అమలు కానుంది.. ప్రస్తుతం మన రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. కరోనా తర్వాత ప్రజల మైండ్ సెట్ కూడా మారిపోయింది .. ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్, బలమైన పోషకాహారం కలిగిన ఆహారం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే రైతులకు బియ్యానికి బదులుగా ఇలాంటి ధాన్యాలను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.. 2023ను కూడా ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరం గా ప్రకటించి ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. అందుకే జొన్నలు, రాగులను.. బియ్యానికి బదులుగా పంపిణీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు.. ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకున్నారు. మెజారిటీ ప్రజల సానుకూలత వ్యక్తం చేశారు. అందుకే వీటిని రేషన్ పంపిణీ దారులకు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.