ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కొన్ని వారాల క్రితం టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరయ్యారు. వారి జీవితంలో అత్యంత కీలకమైన ఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స కీలక ప్రకటన చేశారు. విజయవాడలో రేపు అంటే శనివారం ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు.
ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడిన తర్వాత మంత్రి బొత్స ఈ కీలక ప్రకటన చేశారు. ఇక ఏప్రిల్ 3 నుంచి 18 వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో ఆరున్నర లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.