Amma Vodi : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అమ్మ ఒడి పథకం .. విషయం లో కొన్ని ఆసక్తికర వార్త !

Amma Vodi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమ్మ ఒడి 2023 డబ్బులు అనేవి జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతుంది. సాధారణంగా 2023 లో అమ్మ ఒడి జనవరి నెలలో విడుదల చేయాల్సి ఉంది. గత సంవత్సరం చూస్తే అమ్మ ఒడి 2022 సంవత్సరం జనవరిలో విడుదల చేయాల్సినవి జూన్ నెలకు వాయిదా వేసి.. జూన్ 27వ తేదీన ప్రతి ఒక్క తల్లి ఖాతాలో డబ్బులు అయితే జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదే తరహాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 మొదటి విడత అమ్మఒడి డబ్బులు అనేవి జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం . 2023 అమ్మఒడి 13వేల రూపాయలు నేరుగా తల్లి ఖాతాలోకి జమ చేయనున్నారు.

అమ్మ ఒడి పథకానికి సంబంధించి చైల్డ్ ఇన్ఫోలో వారి డీటెయిల్స్ ను ఎంటర్ చేయవలసి వస్తుంది. ముందుగా తల్లి యొక్క ఆధార్ ఎంటర్ చేసి వాళ్ళ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వారి బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన ఎకౌంటు కి మాత్రమే డబ్బులు పడతాయి. స్కూల్ హెచ్ఎం లాగిన్ లో ఉన్న ఈ ఎకౌంటు చెక్ చేసుకోవాలి.

ఆధార్ బేస్డ్ పేమెంట్ సర్వీసెస్ ను బ్యాంకుకు వెళ్లి ఎనేబుల్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం గతంలో తెలిపింది. మీరు ఇచ్చిన ఎకౌంటు హెచ్ఎం లాగిన్ లో ఎంటర్ చేసిన ఎకౌంటు కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ఎకౌంటు నెంబర్ను మరొకసారి సరి చూసుకోవాలి. ఆ తరువాత వాలంటరీ యాప్ లో పిల్లల ఈకేవైసీ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా మీ ఆధార్ కార్డు నెంబర్లు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. అవన్నీ మీదే అని అనుకుంటేనే మీరు ఈకేవైసీ వేయవలసి ఉంటుంది. మీ బ్యాంకు డీటెయిల్స్ కరెక్టుగా ఉన్నాయా లేదా అనేది మీ స్కూల్ హెచ్ఎం లాగిన్ లో చెక్ చేసుకోవాలి. ఆ తరువాత గ్రామ వాలంటీర్ లేదా సచివాలయ వారి దగ్గర మీ పిల్లల చేత ఈ కేవైసీ అనేది తప్పకుండా వేయించాలి . ఈ రెండు కనుక జరిగితే తప్పకుండా జూన్లో మీ అకౌంట్లో డబ్బులు పడటం ఖాయం.