Hair Tips : మగవారి బట్టతలను దూరం చేసే అద్భుతమైన చిట్కా..?

Hair Tips : జుట్టు అనేది అందంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ కొంతమందికి స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్,పొల్యూషన్ వల్ల జుట్టు బాగా రాలిపోయి బట్టతల ఏర్పడుతుంటుంది. అలాంటి వారు పదిమందిలోకి వెళ్లాలన్నా మొహమాటానికి గురవతుంటారు.వారు ఇంటి చిట్కాలు వాడి ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1.ఉల్లిరసం మరియు అలీవ్ నూనె .. ఉల్లిరసంలో సల్ఫర్ కంటెంట్ అధిక మొత్తాదులో లభిస్తుంది. ఆలీవ్ అయిల్ స్కాల్ప్‌కు పోషణ ఇచ్చి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.ఇది బట్టతల రాకుండా సహాయపడుతుంది. ఒకవేళ వచ్చినా ఇది జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. దీనికోసం చిన్న సైజు ఉల్లిపాయ నుండి రసం తీసి అందులో ఆలీవ్ నూనె కలపాలి.ఈ. మిశ్రమాన్ని బట్టతల ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 15-20 నిమిషాల పాటు మర్దన చేసి,మైల్డ్ షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి రాస్తే బట్టతల సులభంగా నయం అవుతుంది.

2.గుమ్మడికాయ గింజలు.. గుమ్మడి గింజల్లో జుట్టు పెరుగుదలకు అవసరమైన కెరోటిన్ మరియు ఇతర పోషకాలు ఉంటాయి. బట్టతల మచ్చలకు చికిత్స చేయడానికి, రెండు చెంచాల గుమ్మడి గింజల పొడి ఆలివ్ నూనెను తీసుకుని, బట్టతల మచ్చలపై రాయాలి.అరగంట తర్వాత చల్లటి నీటితో తలను శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

A great tip to get rid of male pattern baldness
A great tip to get rid of male pattern baldness

3.ఉసిరికాయ పొడి… ఉసిరి పొడి అనేది జుట్టు పెరుగుదలకు మంచి ఔషదం. ఈ ఉసిరి పొడికి,ఎండు జామకాయ పొడిని చేర్చి పెరుగు కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బట్ట తల వచ్చిన చోట మర్దన చేయాలి. గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఉసిరి పొడి నిర్జీవంగా మారిన స్కాల్ప్‌ను బాగు చేయడంలో సహాయపడుతుంది.

4.విటమిన్ ఇ నూనె.. విటమిన్ ఇ ఆయిల్ చర్మం మరియు జుట్టుకు చాలా ముఖ్యమైనది. సరైన మోతాదులో ఉపయోగించినట్లయితే, ఇది జుట్టు మరియు చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఈ నూనెతో అల్లం రసం కలిపి మాడుకు బాగా మసాజ్ చేయడం వల్ల బట్ట తల స్థానంలో మంచి జుట్టు పెరుగుతుంది.

5.అలోవెరా జెల్… కలబంద స్కాల్ప్ కు మరియు జుట్టుకు తేమను అందించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.అలోవెరా జెల్ తీసుకొని అందులో ఎగ్ వైట్ కలిపి మిశ్రమంగా తయారుచేసి, తలకు మరియు జుట్టుకు అప్లై చేసి బాగా అరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.